సత్కవి
![]() |
ఆయుత కవితా యజ్ఞం విజయోత్సవ సభలో కవి రత్న బిరుదుతో సత్కారం అందుకుంటున్న సందర్భం |
జాను తెనుగుకు తేనెల సోనలద్ది
వెలువరించిన యీతని పలుకులన్ని
మంచి పద్యాలుగా ప్రకాశించు చుండ
భానుడీతడు సత్కవి భానుడౌర!
వెలువరించిన యీతని పలుకులన్ని
మంచి పద్యాలుగా ప్రకాశించు చుండ
భానుడీతడు సత్కవి భానుడౌర!
మంచి మాటలు పలుకుచు నంచితముగ
నాల్గు నూరుల పద్యాలు నవ్య గతుల
వెలువరించిన వీనికి విజయమగుత
అంబటి కవీశ! మా నుతులందుకొనుమ!
అంబటి కవీశ! మా నుతులందుకొనుమ!
సహజ కవి
అంబటినిని మించు ఆదరమును నింక
అవని పైన గెలవ!అదియు కష్టం
ఆత డెంత బాగ అల్లును పద్యాలు
విశ్వ సించు మహిని వీర పదము
అసలు సిసలైన
కవియన్న!యావె రానె!
ఐదు వందలు
పూరించ! అంబ టేమొ
సహజ కవి యందు నేనింక! సంతసించి
తప్పు చెప్పడు వీరన్న తమకు తెలుసు
సహజ కవి యందు నేనింక! సంతసించి
తప్పు చెప్పడు వీరన్న తమకు తెలుసు
కవిత లనుమీరు
కనులార! గాంచినారు
కవితలనుమీరు
కలమార! రాసినారు
అక్ష రములను పొదిగారు! అద్భు తముగ
తప్పు చెప్పడు వీరన్న తమకు తెలుసు
అక్ష రములను పొదిగారు! అద్భు తముగ
తప్పు చెప్పడు వీరన్న తమకు తెలుసు
సహజ కవియందు అంబటి! సత్య మదియె
వేయి చేయగ చేయరు! వెనుక ముందు
తప్పు చెప్పడు వీరన్న తమకు తెలుసు
వేయి చేయగ చేయరు! వెనుక ముందు
తప్పు చెప్పడు వీరన్న తమకు తెలుసు
ఎందరు వ్రాయలేదు
సుకవీశ్వరు లిచ్చట ఐదు నూర్ల మా
కంద మరంద కందములు, కమ్మని గీతులు, స్నిగ్ధ
రాగ ని
ష్యంద మనోజ్ఞ పద్యతతు లంబటి భాను, యవేర గార్లు మా
యందరి ప్రేమ పాత్రులయిరచ్ఛపు సత్కవితల్ రచించుటన్
ష్యంద మనోజ్ఞ పద్యతతు లంబటి భాను, యవేర గార్లు మా
యందరి ప్రేమ పాత్రులయిరచ్ఛపు సత్కవితల్ రచించుటన్
- సీ వీ కుమార్
18-3-16
అంబటి కిరణమ్
చతురశ్శత
పద్యములను
అతులితముగ
వ్రాసినాడు అంబటి కిరణమ్
హితుడౌ
భానూగారికి
రతిపతి
జనకుండొసగును రమ్య శుభంబుల్
మత్తేభవిక్రీడితము
భళిర శభాషు
భానుడిల పంచశతమ్ముల వ్రాసినాడు ను
జ్వలమగు
పద్యరాజములు చక్కని కందము తేటగీతులన్
విలసితమౌ
పదంబులును విజ్ఞులుమెచ్చగ నాటవెల్దులున్
సలలితమైన రీతిగను సత్కవి భాను ప్రకాశ్ డీ ధరన్
సలలితమైన రీతిగను సత్కవి భాను ప్రకాశ్ డీ ధరన్
(భాను ప్రకాశ్
గారు 500 కవితలు పూర్తి జేసిన సందర్భంగా అభినందనలతో ….)
----అంజయ్య గౌడ్
భాను
ప్రకాశుడు
భానుని వలె చెలరేగుచు
భాను ప్రకాశుడు
రచించె పంచశతములన్
పూనుచు పద్యపు
కవితల
జాను తెనుగు
తేటగీతి జాలుల భంగిన్
-
నాగ మంజరి గుమ్మా
No comments:
Post a Comment