శౌరీ
కం**
నారాయణనీ నామము,
నారదమౌనీంద్రు డెపుడు,నరహరి
దలచున్
నారాయణ నామముగను,
నారాయణ మమ్ముగావు నయముగ శౌరీ !
కం**
తల్లివి దండ్రివి నీవని,
యుల్లమునందున గొలచితి యోకమలాక్షా,
కల్లల నాడగ నీయకు,
చల్లగ జూడుము సురేశ
శరణము శౌరీ.
కం**
తల్లివి దండ్రివి నీవని,
యుల్లమునందున గొలచితి నోకమలాక్షా,
కల్లల నాడగ నీయకు,
చల్లగ జూడుము సురేశ
శరణము శౌరీ.
కం**(సర్వలఘు)
గురుడని దలచెద మనమున,
కరుణను గురుపుము కరివర కరుణను గనుమా,
తెరవరు నయితిని గనగను,
కరుణకు జలనిధి హరియును,ఘనుడవు శౌరీ.
నారాయణ యను నామము
నారదమౌనీంద్రు డెపుడు నరహరి యనుచున్
పారాయణజేయు నెపుడు
నారాయణ మమ్ము గావు నయముగ శౌరీ
నారాయణనీ నామము,
నారదమౌనీంద్రు డెపుడు,నరహరి
దలచున్
నారాయణ నామముగను,
నారాయణ మమ్ముగావు నయముగ శౌరీ
కం**
తల్లివి దండ్రివి నీవని,
యుల్లమునందున గొలచితి యోకమలాక్షా,
కల్లల నాడగ నీయకు,
చల్లగ జూడుము సురేశ
శరణము శౌరీ.
కం**
తల్లివి దండ్రివి నీవని,
యుల్లమునందున గొలచితి నోకమలాక్షా,
కల్లల నాడగ నీయకు,
చల్లగ జూడుము సురేశ
శరణము శౌరీ.
కం**(సర్వలఘు)
గురుడని దలచెద మనమున,
కరుణను గురుపుము కరివర కరుణను గనుమా,
తెరవరు నయితిని గనగను,
కరుణకు జలనిధి హరియును,ఘనుడవు శౌరీ.
కం**
కరిమొర వినపడి,
వడిగొని,
కరుణను వెలయగ సిరివరు గదిలెను గావన్,
నరహరి బిలిచిన,పలుకును
మరువకు మదనుని జనకుని మనమున శౌరీ..!! ( 5)
23.02.2016.
కం**
కలడని యందురు నిన్నే,
కలడని చెప్పిరి కథలుగ *,కాదన లేనే ! !
కలనని జెప్పిన నీవే,
కలిగిన చోటును దెలుపుము* కపిలా శౌరీ! !
కం**
కలనంటివి నిలిచితినే
నిలనంటివయకరివరద*నిలచిన వెటయా!
తలచెడు గాయకు మదిలో,
పలికెడి కీర్తనలయందు *బందివి ! శౌరీ....!!
29.02.2016.
కం**
సురలకు గలిగెను యిడుములు,
మరువక దలచిరి మహిమను మహిధర నాధా !
కరుణను గలిగియు దొలగగ
వరముల నొసగుచు యమరుల మనిచిన శౌరీ...!!
కం**
గలిగెను యిడుములు,
మరువక దలచిరి మహిమను మహిధర నాధా !
కరుణను గలిగియు దొలగగ
వరముల నొసగుచు యమరుల వడిగొను శౌరీ...!!
సిరికిన్ జెప్పన్ లేదట,
కరమున చక్రము మరచియు కదిలితి వీవే
వరమిడెడిగరుడ వాహన,
నిరతము మరువక దలచెద
నిన్నే శౌరీ !!
కం**
సర్వము నెరిగిన వారిని,
సర్వకులవమానపర్చి జయవిజయులటన్.!
గర్వము గలిగియు తూలిరి ,
సర్వేషుభటులకు గలిగె శాపము ,శౌరీ !!
కం**
అవతా రములను దాల్చియు,
భవతారకమునుపదేశ పరచగ యెంతున్,!
యవగుణ ములమాన్పెదవే,
తవపాదములే శరణని తలచెద శౌరీ !!
కం**
పుడమిని చాపగ జుట్టియు,
కడలిని జేరెన,యసురుడొకనిహరి
గాంచెన్,
వడిగొనె యాదివరాహమె,
కడలిహిరణ్యాక్షుజంపి కాచెను శౌరీ..!!
హరిజూపుమంటు జనకుడు,
కరుణను మానీ యిడుములె కల్గింపగనే !
శరణని దలిచెను కొమరుడు,
నరహరి రూపము ధరించి ననచెన్. శౌరీ..!!
శివుడన కేశవుడొకడే,
భవుడన బలరాముడొకడె భావింపగనే .!
నవనిని గావగ గదలెను,
నవనీతమునే ప్రియమయె నటనము శౌరీ! !
బిందువు జూసిన నీవే,
సిందువు లోనన్ యగుపడు చిన్మయ రూపా!
వందిత గుణధరు హరియే,
యెందున జూసిన యగుపడు యీశ్వరు శౌరీ. !!
కం**
ఓంకారమె నీవుశివా,
ఓంకార స్వరమధురము నోశివ గన. వా!
ఓంకారమందు నిరతము,
ఓంకార హరిహర రావ నోహరి శౌరీ...!! (309.)
౨.మత్స్యావతారము.
కం**
సోమకుడను యసురుడొకడు,
ధీమముతోయపహరించె దేవుని శృతులున్,
నీమము దలచిరి ,మీనమె
సోమకు దృంచిన శృతులవి సులభమె శౌరీ..!!
౩౨౨
అన్యము నెరుగను స్వామీ,
యన్యపు వేల్పుల గొలువను, యాదిన్ మరువన్
యన్యపు మాటల నాడన్,
ధన్యత నొందుదు నినుగని ధరలో శౌరీ !!
౩౩౧.
ఓం సం సరస్వత్యై నమః
ReplyDeleteఓం గం గణపతయే నమః
అంబటి వంశము నందున సంబరము గలుగ జనించి
మా కందించితివి సాహితీ సౌరభం మిగుల అబ్బురముగా
శ్రీధర్ గారు
Deleteధన్యవాదాలు.