భానుని మాట


భాను మంచి మాట

 
🌺 పైస-పరమాత్మ🌺

**ఆటవెలది**

పైస జూప లేదు పరమాత్మ నెప్పుడూ,

పైస జూపు నన్న పాహి యందు,  !

పైస నమ్ము కొన్న పనికిమా లినిజేయు,

మరువ వలదు భాను మంచి మాట.!!

 

 

22.02.2016. శాఖాహారము

ఆ**                             

కాయ గూర దినుము కండకూ బలమౌను,

ఆకు కూర లన్న యలుసు వద్దు

ఆకు కాయ లేర ఆయువు బెంచును

మరువ వలదు భాను మంచి మాట. !!    1

ఆ**

జీవి జంపి దినగ సేమమే గాదుర

శాఖ హార మన్న శక్తి గలుగు.

ఆకు కూర లుండె అమితమైనబలము

మరువ వలదు భాను మంచి మాట. !!   2

ఆ**

లంక గాల్చిహనుమ లంఘించె గగనాన,

కడలి మీద నెగిరె కాంతి తోడ

హనుమ దిన్న దేమి యడవికాయలుగాద

మరువ వలదు భాను మంచి మాట. !!    3

ఆ**

కొండ లన్ని దిరుగు కోతుల గుంపులు,

దొరికి నంత దినును దూర మనక!

చేరి గట్టి నాయి సేతువు గనలేదా,

మరువ వలదు భాను మంచి మాట.!!      4

ఆ**

బలము గలుగు దినుము బాగుగా మాంసము

ననుచు చెప్ప గలరు యాస బెట్టి

బలము గలిగి యున్న బలహీను డెట్లయ్యె

మరువ వలదు భాను మంచి మాట. !!    5

ఆ**

పప్పు యన్న మన్న పాయస మేయౌను,

శాఖహార మన్న సార ముండు,  !

పప్పు ఒప్పు ననెది పదిమంది మాటరా

మరువ వలదు భాను మంచి మాట. !!     6

ఆ**

పాల కూర యాకు కలగూర. కాయలు

శక్తి నిచ్చు తనువు చక్క గుండు.

రోగ మన్నది లేదు రూపులే బాగుండు

మరువ వలదు భాను మంచి మాట. !!      7

22.02.2016.

ఆ**

తల్లి తనము జూడు తపన యె ట్లుండెను,

తల్లి మనసు యెపుడు తనయు జూచు,  !

తపన బడెడి మనసు తల్లికే యుండురా,

మరువ వలదు భాను మంచి మాట.  !!

ఆ**

తల్లి తనము జూడు తపనయె ట్లుండెను,

తల్లి మనసు యెపుడు తనయు జూచు,  !

తపన బడెడి మనసు తల్లికే యుండురా,

మరువ వలదు భాను మంచి మాట.  !!

           "   అడవులు  "(పరిరక్షణ)

ఆ**

ఆది నుండి జనుల యడవియే గాపాడె

అడవి రక్ష నిచ్చి యాదు కొనియె  !

రక్ష జేసె యడవి భక్షణ జేయకు

మరువ వలదు భాను మంచి మాట !!   1

ఆ**

అడవి నున్న నాళ్ళు హాయిగా సాగెను

అడవి విడిచి రాగ అష్ట కష్ట.  !

మాయె,యడవి తల్లి మనలను కాపాడె

మరువ వలదు భాను మంచి మాట. !!   2

ఆ**

చక్ర వర్తి యయ్యి చెట్లు బెంచ,య శోకుడే

చాటి చెప్పె రాజు చక్క గాను,  !

రాజు పేద కాని రక్షించ వలయును,

మరువ వలదు భాను మంచి మాట.   !!   3

ఆ**

కన్న తల్లి లాగ కష్టాలు దీర్చునే

అడవి తల్లి మనకు అండ గాదె  !

అండ నుండె తల్లి  మండగా జేయకు

మరువ వలదు భాను మంచి మాట.  !!   4

ఆ**

తల్లి తనము జూడు తపన యె ట్లుండెను,

తల్లి మనసు యెపుడు తనయు జూచు,  !

తపన బడెడి మనసు తల్లికే యుండురా,

మరువ వలదు భాను మంచి మాట.  !!

23.02.2016.

 

 

టీ.వి.సీరియల్స్‌.

ఆ**

మంచి చెడుల నెపుడు మంచిగా చెప్పుచు,

గతము నందు నొందె  గౌర వ మ్ము.

గతము మరచి నేడు గడబిడ మొదలాయె.,

మరువ వలదు భాను మంచి మాట.

 

ఆ**

టీవి సీరి యళ్ళు టిప్పుటప్పుయెగాద,

సీరియల్ళు జూడ చింత గలుగు

చూడకున్న చాల చిరునవ్వు వెలుగులే

మరువ వలదు భాను మంచి మాట.

 

ఆ**

అత్త ఓర్వ దెపుడు  యందమౌ  కోడల

మామ, కొడుకు చూడ మౌన మునులె,

ఆడ వాళ్ళ మధ్య అణుబాంబు మాటలే,

మరువ వలదు భాను మంచి మాట.

 

ఆ**

ఆట పాట లేదు అందమే లేదిక,

చింపు గుడ్డ లేసి చిత్ర మనెరు.

వెర్రి లేచి తిరిగి విలువలే మరచిరి.

మరువ వలదు భాను మంచి మాట

 

ఆ**

ఆడ దాని కెపుడు నాడదే శత్రువు,

అనుచు చూపు చుండ్రు అంద ముగను,

సీరి యళ్ళు జూసి చీవాట్లు నేర్చిరి ,

మరువ వలదు భాను మంచి మాట.

 

ఆ**

సీరియళ్ళు జేయు చిత్రాలు వింతగా,

మగని పిల్లలనియు మరతు రెపుడు

కూడుబెట్ట కుండ కూతబెట్టింతురు

మరువ వలదు భాను మంచి మాట.

ఆ**

వనిత లంత గలసి వంటలు జేయక,

యెండబెట్టు చుండు యెదురు బల్కు

బయటి తిండి తినగ బాధలే గలిగించె,

మరువ వలదు భాను మంచి మాట.

ఆ**

భువన మంత మరచి భుక్తిలోమునిగియు,

పెరుగు చుండె తనువు పెరిగి పెరిగి,

రోగ బాధ లెన్నొ తగులునేయిట్లుగా,

మరువ వలదు భాను మంచి మాట.

 

ఆ**

సాగు చుండ యెంతొ సాగదీతురుకథ,

సోది తప్ప కథను చూడ గలమె,

ఏళ్ళ కేళ్ళుసాగు యీనాటి సీరియల్

మరువ వలదు భాను మంచి మాట.

తేది. 05.03.2016.

 

 ఆ**

చిట్టి దాని పలుకు చిలుకప లుకులాయె,

తోట లోన యెగురు తుంట రాయె,

ఏడ్పు నవ్వు గాని యెటులైన మురిపెమే,

మరువ వలదు భాను మంచి మాట.

 

రిక్షా తండ్రి కి...

ఆ**

బ్రతుకు దెరువు కొరకు బలియాయె తండ్రియె,

రక్ష కొరకు దొక్కె రిక్ష నెపుడు,

కొడుకు నొడిని జేర్చ కోటిదే వుడతడు,

మరువ వలదు భాను మంచిమాట

 

తే**

సహన మందున భూమాత సాధ్వి తాను,

మగని నడిపించు వెనుకుండి మహిమ తాను,!

బాధ పెట్టగ వలదురా భార్య నెపుడు.

మరువ వలదోయి భానుని మంచి మాట.  !!          

 

తే**

సాయి నాధుని కృపయేర సాయ మౌను,

సాయి వదలడు యెవరిని సాక కుండ,

సాయి నామము పలుకుర సాయ మందు,

మరువ వలదోయి భానుని మంచి మాట.

ఆ**

      ఆడ పిల్ల గనగ యాపద యౌచుండె,

      ఎటుల బెంచ వలెనొ ఇట్టి యవని,  !

      ఆడ పిల్ల గావ నందరు గదలాలి

      మరువ వలదు భాను మంచి మాట. !!

ఆ**

    ఆడ పిల్ల యెపుడు యాటబొమ్మయెగాదు,

    ప్రాణ మున్న జీవి పడతి తాను,

    యింటి దీప మనగ యిట్లునే జెప్పితి,

    మరువ వలదు భానుని మంచి మాట.

 

        తేది.09.03.2016.

 

ఆ**

మర్రి వృక్ష మెంత మర్రిచె ట్టెంతనే,

కనుల ముందు జూడ కాంచ గాను,

బిందు వందు నిలిచి సిందువే నిలయౌను,

మరువ వలదు భాను మంచి మాట ..!!

ఆ**

రేయి మించు చుండె రేపవు చుండెను,

నిద్ర పోయి లెండు నిక్క ముగను,

రేయి నిద్ర చాల వేయిరెట్లవసరం,

మరువ వలదు భాను మంచి మాట. !!(311)

 

13.03.2016.

ఆ**

ఎండ వేడి యచట యెరుకనే మాకును,

దాని తోడు కవిత దాను కలసెి

రెంటి వేడి గలిగి రేయిగా వలెచల్ల,

మరువ వలదు భాను మంచి మాట!

 

కళల చంద్రు డచట కలిగించె చల్లన,

కవిత లల్లు చుండ్రి కలిసి కొనియ,

విల్ల సిల్ల వలెను వేయిక వులజట్టు,

మరువవలదు భాను మంచి మాట. !!

 

చేతి ముద్ద.-ముద్దు.

ఆ**

అమ్మ చేతి ముద్ద అనురాగమే జూపు,

అమ్మ చేతి ముద్ద యమృత మౌను,

అమ్మ చేయి నొదిలి యరువుచేతులుయేల,

మరువ వలదు భాను మంచి మాట. !!

316.

ఆ**

చిన్న తనము నుండి చేకల్పి తినిపించు,

చేతి ముద్ద తినగ  చేరు మనసు,

కలిపి తినుట మనకు కలిమియే తనువుకు,

మరువ వలదు భాను మంచి మాట. !!

317

ఆ**

బన్ను తినెడి వాడు చిన్నదెలివివాడు,

వాడి మాట లేల, వరస గాదు.

పులిని జూచె నక్క ,పులియౌన వాతతో ,

మరువ వలదు భాను మంచి మాట. !!

318

ఆ*

చేతి యన్న మైన చేకల్పి తినగానే,

కరము కదలు చుండు కఠినమే లేకుండ,

చేతి వేళ్లు కదల చిత్రమౌ నాడులే,

మరువ వలదు భాను మంచి మాట. !!

319

ఆ**

పప్పు అన్న మెపుడు మెప్పించు మనలను,

సాంబ రన్న మంటె చాలు యనరు,

పోర్కు తోడ దినగ పోరుసల్పుటయేర,

మరువ వలదు భాను మంచి మాట. !!

320

ఆ**

పెద్ద వాళ్ళ మాట చద్దిమూటయనుట,

మరువ రాదు యెపుడు మహిని యందు,

మరువ రాదు యెపుడు మనదేశ సంస్కృతి,

మరువ వలదు భాను మంచి మాట. !!

321.

13.03.2016.

"బాల్యవివాహాలు

తే**

యేమి యెరుగని తనమున యెట్లు జేతు,

బాల్య మందున పెళ్ళది భార మౌను,

తప్పు జేయకు మాయెడ తండ్రు లార,

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

౩౨౫

తే**

చిన్న తనమున పెళ్ళిళ్ళు చింత యేర,

చిగురు వంటిది బాల్యము చిదుమ రాదు,

చక్క దనమున భవితను చక్క జేయ,

మరువ వలదోయి భానుని మంచిమాట !!

౩౨౬.

తే**

మాట యిచ్చితి మనుచును మనువు జేయు,

మంచి పనియేన చేయగ మనువు నెపుడు

తల్లి దండ్రులు యొకపరి తలచి జూడ,

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

౩౨౭

తే**

బాల్య మనగను బంగరు భవిత యండ్రు

వేయ రాదది కష్టపు విషము లోన,

బలియె యౌనులె బాలల బాల్య మంత! !

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

౩౨౮

తే**

పెద్ద తనమున జేసెడి పెద్ద తప్పు,

ముద్దు లొలికెడు పిల్లల మోము జూడు,

మరతు రెట్లుగ మమతను మంచి తనమె! "

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

౩౨౯

తే**

చిన్న తనమున పెళ్ళిళ్ళు చేయ వద్దు,

చిన్న పిల్లల భవితకు చింత వద్దు,

తెలిసి మసలుము మీరలు తెలివి గలిగి,

మరువ వలదోయి భానుని మంచిమాట !!

౩౩౦.

 

అవినీతి ....

తే**

ఎందు వెతకిన యవినీతి యందు నుండె,

లేదు యన్నట్టి చోటది లేదు నిలను,

యెందు వెతకిన గలదుర పొందు గాను.

మరువ వలదోయి భానుని మంచి మాట! !

౩౩౨.

తే**

చిన్న పెద్దను పనులని చేర వచ్చె,

ఎట్టి విషయము గానిమ్ము ఎప్పు డైన,

నేను లేనిదె సాగవు పనులు యెపుడు,

మరువ వలదోయి భానుని మంచి మాట!

౩౩౩.

తే**

 గుట్టు చప్పుడు గానట్టి గుడ్డి తనము,

నడచు చుందును నందరి నడుమ నందు,

నేను లేనిదె పుడమిన పనులు గావు.

మరువ వలదోయి భానుని మంచి మాట!

౩౩౪.

తే**

నీతి గలదుర నాలోన నిలిచి ఉంది.

యిచ్చు కొన్నవా రిపనులు యిట్లె పూర్తి.

యివ్వ నన్నట్టి వారికీ  యిహము పరమె,

మరువ వలదోయి భానుని మంచి మాట!

౩౩౫.

తే**

లంచ మిత్తురు పనులవి లక్ష్య మవగ,

లంచ మిత్తురు పదవుల లక్ష్మి కొరకు,

పేరు యవినీతి యందురు ప్రియ ముగను,

మరువ వలదోయి భానుని మంచి మాట!

౩౩౬.

తే**

ఎంత వార లైననుగాని యెక్క డైన,

నంద రొకటిగ జూచును యంద ముగను,

భేద భావము లేదిట యెందు జూడ,

మరువ వలదోయి భానుని మంచి మాట !!

౩౩౭.

తే**

నీతి యన్నది లేదవి నీతి యనగ,

వృక్ష మయ్యది పెరిగెను వటము నాయె,

తృంచ వలెనది యవినీతి తరువు నెపుడు.

మరువ వలదోయి భానుని మంచి మాట. !"!

౩౩౮.

తే**

నీతి దప్పియు నడచుట నేర మౌను,

తప్పు జేసిన వానిని మెప్పు యనరు,

తప్పు జేయక నడువుము తలపు గలిగి.

మరువ వలదోయి భానుని మంచి మాట. !"!

తే.గీ.**

కలువ నెంచిరి చెలులంత చాల గాను,

సంత సముతోన సమయము సాగ గాను,

మరచి పోనట్టి సంగతి మనన

జేయ,

మరువ వలదోయి భానుని మంచి మాట.(341)

తే**

మనిషి జన్మము మంచిగ మనగ జేయి

యార్తి నిండిన పిలుపిన్న కీర్తి గలుగు,

తెలివి గలిగియు జెప్పితి తేట గాను,

మరువ వలదోయి భానుని మంచి మాట. !!(348)

తే**

తల్లి దండ్రుల సేవయె తలను దాల్చి,

మోయు చుండెను కావడి మోద మలర,

తల్లి దండ్రుల నెప్పుడు  తలచు మదిన,

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

తే**

పరమ పావని గంగనీ పాద మందు,

పుట్టి పరుగులు బెట్టెను పుడమి పైన,

యట్టి గంగను మునిగియు యందు కృష్ణ.

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

తే**

భామ లిరువురు గూడిన భవుని జూడ,

భాగ్య మనియని దలచితి భవిత గనక,

భామ లిద్దరు యైనను భవిత సున్న,

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

తే**

రామ నామము మహిమను రాత్రి పవళు,

మరువ దప్పక పలుకుము మనసు నందు,

రాము జూడును మరువక  రక్షనెపుడు ,

మరువ వలదోయి భానుని మంచిమాట !!

తే**

మాట లన్నవి లేవిట మనుషు లేరి,

మూట గట్టచు నుండిరి ముందు గానె,

మాట మూటలు విప్పుటా మంచి గాదె. ??

మరువ వలదోయి భానుని మంచి మాట. !!
 

తే**

రామ నామము మహిమను రాత్రి పవళు,

మరువ దప్పక పలుకుము మనసు నందు,

రాము జూడును మరువక  రక్షనెపుడు ,

మరువ వలదోయి భానుని మంచిమాట !!

 

తే**

మాట లన్నవి లేవిట మనుషు లేరి,

మూట గట్టచు నుండిరి ముందు గానె,

మాట మూటలు విప్పుటా మంచి గాదె. ??

మరువ వలదోయి భానుని మంచి మాట. !!

 

 

 

No comments:

Post a Comment