Wednesday, March 30, 2016

శాఖాహారము

ఆ**                             

కాయ గూర దినుము కండకూ బలమౌను,

ఆకు కూర లన్న యలుసు వద్దు

ఆకు కాయ లేర ఆయువు బెంచును

మరువ వలదు భాను మంచి మాట. !!    1

ఆ**

జీవి జంపి దినగ సేమమే గాదుర

శాఖ హార మన్న శక్తి గలుగు.

ఆకు కూర లుండె అమితమైనబలము

మరువ వలదు భాను మంచి మాట. !!   2

ఆ**

లంక గాల్చిహనుమ లంఘించె గగనాన,

కడలి మీద నెగిరె కాంతి తోడ

హనుమ దిన్న దేమి యడవికాయలుగాద

మరువ వలదు భాను మంచి మాట. !!    3

ఆ**

కొండ లన్ని దిరుగు కోతుల గుంపులు,

దొరికి నంత దినును దూర మనక!

చేరి గట్టి నాయి సేతువు గనలేదా,

మరువ వలదు భాను మంచి మాట.!!      4

ఆ**

బలము గలుగు దినుము బాగుగా మాంసము

ననుచు చెప్ప గలరు యాస బెట్టి

బలము గలిగి యున్న బలహీను డెట్లయ్యె

మరువ వలదు భాను మంచి మాట. !!    5

ఆ**

పప్పు యన్న మన్న పాయస మేయౌను,

శాఖహార మన్న సార ముండు,  !

పప్పు ఒప్పు ననెది పదిమంది మాటరా

మరువ వలదు భాను మంచి మాట. !!     6

ఆ**

పాల కూర యాకు కలగూర. కాయలు

శక్తి నిచ్చు తనువు చక్క గుండు.

రోగ మన్నది లేదు రూపులే బాగుండు

మరువ వలదు భాను మంచి మాట. !!      7

 

పైస-పరమాత్మ

**ఆటవెలది**

పైస జూప లేదు పరమాత్మ నెప్పుడూ,

పైస జూపు నన్న పాహి యందు,  !

పైస నమ్ము కొన్న పనికిమా లినిజేయు,

మరువ వలదు భాను మంచి మాట.!!

దేశ భాష అభ్యసించు

తే**

ఆంగ్ల మొక్కటె గాదుర అవని  యందు,

భాష లెన్నియొ యున్నవి  బంధు లార

దేశ భాషను అభివృద్ధి దెలియ గనుము

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

  తే**

అఖిల భాషలు భాషించు భాగ్య మబ్బ

ఆంగ్ల మాదిగ భాషలు యభ్య సించు

దెలుగు భాషను యుంచుము దిరుగు లేక

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

మాతృభాష

సీ**

మాతృభాషనెపుడు మనసందు దలువుము

       మరువరానిదెపుడూ మహిని యందు,

పుట్టినదిమొదలు గిట్టువరకునుండు,

      తల్లిభాషనెపుడు తలువ వలయు.

పరభాషలెన్నియో పాటిసేయగరావు

       పలుకవలయునేడు పరువుగల్గ,

అన్యభాషనునేర్చి యందమందురెగాని,

       యమ్మభాషనుమాట "యక్షయంబె."

 

ఆ-*

తల్లి దండ్రి తోడ తలపునే నుండును,

మరణ కాల మైన మరపు రాదు.

మాతృ భాష బల్క మంచియౌ నేగాని

కష్ట మనగ లేదు కాంచ నెపుడు.

 

తే**

తల్లిపాలనుగూడుక తనకు నబ్బు      

  అమృతమేయంటి, సేవింపు యమ్మ భాష.

తెలియ జెప్పితి నేడిగ దెలివి గలిగి,

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

చెరువు.

ఆ**

అడవి పక్షులన్ని హాయిగా బ్రతికేను,

చెరువు గాచు వాని కరువు రాక

మనుషు లంత గలిసి మనగనే గాపాడు

సకల జంతు గణము సంత రింప

 

ఆ**

అన్నదాత యెపుడు యాధార పడుగాని,

చెరువు దీర్చు యెపుడు కరువు నంత

జీవకోటి బ్రతుక జీవనాధారము

నీటినెపుడు నీవు నిలిపియుంచు.

 

ఆ**

అన్నదాత లేక. నాహారమేలేదు,

నీవులేక యున్న నిలువలేడు.

నీటినొసగి జనుల నిత్యమూగాపాడు,

చెరువు దొలగ జేయు కరువు నెపుడు,

 

కం**(సర్వ లఘు కందము)

చెరువును,నెగలగ యెపుడును

మరువక దలువర మనుపగ మరిమరి    చెబుదున్,

చెరువును చెరపక నిలుపుము,

చెరువును చెరపగ దలచిన, చెరుపవు మనకున్.

 

 

 

సెల్లు (దూరశ్రవణ యంత్రం)

తే**

మనుషు లందర గలుపగ మహిని యందు

మనిషి మేధను బుట్టెను మంచి కొరకు

దూర భారము నున్నట్టి వారి కొరకు

మాట లాడగ నెంచిన మనసు కొరకు.

 

ఆ**

సెల్లు లేక పోతె చిత్రంగ జూచుచు,

చిన్న పెద్ద కెపుడు  సెల్లు ప్రీతి.

మాట లాడ గాదు యాటలా డగవచ్చు.

సెల్లు గలుగు వాడి సిరిని గనుము

 

ఆ**

చేత సెల్లు నున్న సెల్పినీ దీయుచు

వంగి లేచి నిలచి వంక బోయి,

స్టయి లెన్నొ బడెరు చక్కగాయందరు

పంపు చుంద్రు యన్ని పరుల కొరకు.

ఆ**

చేత నున్న సెల్లు కొంతయే మంచిరా.

చేయు చుండె ,కొన్ని చిలిపి పనుల,

పరుల బాధ బెట్టి  పగలన వ్వుదురేల

పనికి మాలి చేయు పనియు గాదె.

 

 

పువ్వు-దైవం

ఆ**

పువ్వు చుట్టు దిరుగు పురుగులె ప్పుడుగూడ,

పువ్వు దిరుగ బోదు పురుగు చుట్టు

దైవ మన్న గూడ దరిజేర రమ్మనును

మనసు లేక పిలువ కనడు మనల.

 

పరమ పురుషుడు-దాశరధి.

ఆ*

మనసు యనెడి నారి మైమరచితిరిగి,

చేరు చుండె నీదు చేరు వగను

దరిని జేర్చు వాడె దాశరథి యిలలోన

దర్శ నమును యిచ్చి ధన్యు జేయు.
 
 

మిత్ర బృంద మేది

ఆ.

యేటు బోయి నారు యేడను న్నారయా,
మిత్రు లార యేల మీరు రారు,
ఎదురు జూసి కన్ను యెట్లుగా కాయాయె,
వేగ ముగను రాగ  విన్న వింతు

మేడారం తిరునాళ్ళు.

సీ.

 మేడార మందున మేటిగా వెలిసారు

              సమ్మక్క సారక్క సాటి ఎవరు.

రెండేళ్ళ కోసారి దండిగా జరిగేను,

              నష్టమన్నదిలేదు నమ్మి కొలువు,

వనమందు దేవత వరములే యిచ్చేను,

       మనసందు కొలువుంచి మనన జేయి.

జాతరే జరిగేను జనములే గొలిచేరు,

         సమ్మక్క సారక్క చక్క జూడు.

తే**

వీర తెలగాణ గడ్డపై వీరు లయ్యి,

వనము నందున వేల్పుగ వసుధ నిలచి,

మాఘ మాసము నందున మనసు గలిగి

జరుగు తిరునాళ్ళు వైభవ మరసి జూడ,

 

ఆ**

బండి వెన్క బండి బాగుగా నిలిచుండె

బస్సు నిండ జూడ భక్తు లంత,

వనము నందు జూడ వరుసగా యెటుజూడ,

భక్తి గల్గి గదలె బాగు నెంచి.

 

 

Tuesday, March 29, 2016

వృద్దాశ్రమాలు

ఆ.   యవన కాలమందు యైనవాళ్ళకుయెంతో
       సేవ జేసి చాల శిధిల మైరి,   !
       ముసలి తనము నందు ముసిరెను కష్టాలు..

       తీర్చు వారు లేక తిప్ప లయ్యె.          1.

 
ఆ.    కష్ట మనగ గలిగె కంటనీరొలికెనే
        చెప్ప లేమనుచును చెమ్మగిల్లె,
        కొడుకు కొడుకనుచును కోరిక తోడను
       బెంచి బెద్ద జేసె ప్రేమ గలిగి.              2.

 
ఆ.   కొలువు దొరికి నంత కొడుకుగదలిపోయె,
      కోడలెట్లు  మాకు కూతురౌను,
       మనసులేనిజనుల మంచిమాటలులేక
       మనసు బాధ గలిగె మహిని యందు.     3.

 
ఆ.   చేత గవ్వలేదు చేరదీయగలేరు,
       ధనము లేకమేము ధర్మమడుగ.
      నడుపు చుండెడబ్బు నరులనిదెలువుము,

      చింత గలిగి, చాల చిక్కిపోతి.           4.

ఆ.    ఐనవారు లేక యాదుకొనగలేక
        తలను దాచుకోగ తలపునెంచి
       దైవమన్న వాడు దారిని జూపించె
 యిట్లనాధ నైతియిడుము గలిగి.  !     5.
 
ఆ.    ఆశ్రమాలు నేడుయక్షయం బాయెను,
        యొడిని జేర్చి చాల నోర్పునిచ్చె.
        చావువచ్చు వరకు బ్రతుకునీడ్చగవలె
        తప్పలేదు యిట్టి తనువు కొరకు.        6.

 

Sunday, March 27, 2016

ఏదేశం


ఏదేశ సంస్కృతికి
ప్రపంచ దేశాలు గౌరవాన్నిస్తాయో

 ఏదేశ ఆచారాలకు
ప్రపంచం అబ్బుర పడుతుందో

ఏదేశ ప్రజలకు
ప్రపంచం చేతులెత్తి నమస్కరిస్తారో

ఏదేశ ఐక్యతకు
ప్రపంచదేశాలు నీరాజనమిస్తాయో

ఏదేశ ఆప్యాయతలకు
ప్రపంచజనం ఆదమరుస్తుందో

ఏదేశ మేధస్సును
ప్రపంచ దేశాలు " మేటి" యనిపొగడుతాయో

అట్టి, ......
ఆదేశం....
నీ భా ర త దే శ ం.
భారతీయుడనని గర్వించు,
భరతమాతను సేవించు.

 

Saturday, March 26, 2016

సురవళి


ఎరవళి కాదు

సు ర వ ళి.....

అది

భూసురవళి...

వేదవ్యాసుడి

అయుతశిష్యులు

ఒకచో చేరగ..

సాగుచున్నది నేడొక

మహాయజ్ఞం.

 

లోక క్షేమము ధ్యేయంగా

నేటి క్షామము తొలగించా

అయుత చండీ యాగమే

సాగుచున్నది ...

ఎందరో రాజుల కాలంలో

సాగిన వెన్నోయాగాలు

కర్మను చేయి ఫలితంకోరకు

గీతాసారము ఇదే కదా....

మనిషి కాదు నిత్యము

మంచే ఎపుడూ సత్యము.

 

Monday, March 21, 2016

కందం




శ్రీ శైల క్షేత్రముయే,
భూశైల క్షేత్రము ధరించు భూతల మందున్,! !
శ్రీ శైల నాధుని జూడుము,
శ్రీశైల దర్శన ఫలమది సిరినీ కొసగున్! !