Tuesday, March 29, 2016

వృద్దాశ్రమాలు

ఆ.   యవన కాలమందు యైనవాళ్ళకుయెంతో
       సేవ జేసి చాల శిధిల మైరి,   !
       ముసలి తనము నందు ముసిరెను కష్టాలు..

       తీర్చు వారు లేక తిప్ప లయ్యె.          1.

 
ఆ.    కష్ట మనగ గలిగె కంటనీరొలికెనే
        చెప్ప లేమనుచును చెమ్మగిల్లె,
        కొడుకు కొడుకనుచును కోరిక తోడను
       బెంచి బెద్ద జేసె ప్రేమ గలిగి.              2.

 
ఆ.   కొలువు దొరికి నంత కొడుకుగదలిపోయె,
      కోడలెట్లు  మాకు కూతురౌను,
       మనసులేనిజనుల మంచిమాటలులేక
       మనసు బాధ గలిగె మహిని యందు.     3.

 
ఆ.   చేత గవ్వలేదు చేరదీయగలేరు,
       ధనము లేకమేము ధర్మమడుగ.
      నడుపు చుండెడబ్బు నరులనిదెలువుము,

      చింత గలిగి, చాల చిక్కిపోతి.           4.

ఆ.    ఐనవారు లేక యాదుకొనగలేక
        తలను దాచుకోగ తలపునెంచి
       దైవమన్న వాడు దారిని జూపించె
 యిట్లనాధ నైతియిడుము గలిగి.  !     5.
 
ఆ.    ఆశ్రమాలు నేడుయక్షయం బాయెను,
        యొడిని జేర్చి చాల నోర్పునిచ్చె.
        చావువచ్చు వరకు బ్రతుకునీడ్చగవలె
        తప్పలేదు యిట్టి తనువు కొరకు.        6.

 

No comments:

Post a Comment