సీ**
మాతృభాషనెపుడు మనసందు దలువుము
మరువరానిదెపుడూ మహిని యందు,
పుట్టినదిమొదలు గిట్టువరకునుండు,
తల్లిభాషనెపుడు తలువ వలయు.
పరభాషలెన్నియో పాటిసేయగరావు
పలుకవలయునేడు పరువుగల్గ,
అన్యభాషనునేర్చి యందమందురెగాని,
యమ్మభాషనుమాట "యక్షయంబె."
ఆ-*
తల్లి దండ్రి తోడ తలపునే నుండును,
మరణ కాల మైన మరపు రాదు.
మాతృ భాష బల్క మంచియౌ నేగాని
కష్ట మనగ లేదు కాంచ నెపుడు.
తే**
తల్లిపాలనుగూడుక తనకు నబ్బు
అమృతమేయంటి, సేవింపు యమ్మ
భాష.
తెలియ జెప్పితి నేడిగ దెలివి గలిగి,
మరువ వలదోయి భానుని మంచి మాట.
No comments:
Post a Comment