Wednesday, March 30, 2016

శాఖాహారము

ఆ**                             

కాయ గూర దినుము కండకూ బలమౌను,

ఆకు కూర లన్న యలుసు వద్దు

ఆకు కాయ లేర ఆయువు బెంచును

మరువ వలదు భాను మంచి మాట. !!    1

ఆ**

జీవి జంపి దినగ సేమమే గాదుర

శాఖ హార మన్న శక్తి గలుగు.

ఆకు కూర లుండె అమితమైనబలము

మరువ వలదు భాను మంచి మాట. !!   2

ఆ**

లంక గాల్చిహనుమ లంఘించె గగనాన,

కడలి మీద నెగిరె కాంతి తోడ

హనుమ దిన్న దేమి యడవికాయలుగాద

మరువ వలదు భాను మంచి మాట. !!    3

ఆ**

కొండ లన్ని దిరుగు కోతుల గుంపులు,

దొరికి నంత దినును దూర మనక!

చేరి గట్టి నాయి సేతువు గనలేదా,

మరువ వలదు భాను మంచి మాట.!!      4

ఆ**

బలము గలుగు దినుము బాగుగా మాంసము

ననుచు చెప్ప గలరు యాస బెట్టి

బలము గలిగి యున్న బలహీను డెట్లయ్యె

మరువ వలదు భాను మంచి మాట. !!    5

ఆ**

పప్పు యన్న మన్న పాయస మేయౌను,

శాఖహార మన్న సార ముండు,  !

పప్పు ఒప్పు ననెది పదిమంది మాటరా

మరువ వలదు భాను మంచి మాట. !!     6

ఆ**

పాల కూర యాకు కలగూర. కాయలు

శక్తి నిచ్చు తనువు చక్క గుండు.

రోగ మన్నది లేదు రూపులే బాగుండు

మరువ వలదు భాను మంచి మాట. !!      7

 

No comments:

Post a Comment