సీ.
మేడార మందున మేటిగా వెలిసారు
సమ్మక్క సారక్క సాటి ఎవరు.
రెండేళ్ళ కోసారి దండిగా జరిగేను,
నష్టమన్నదిలేదు నమ్మి కొలువు,
వనమందు దేవత వరములే యిచ్చేను,
మనసందు కొలువుంచి మనన జేయి.
జాతరే జరిగేను జనములే గొలిచేరు,
సమ్మక్క సారక్క చక్క జూడు.
తే**
వీర తెలగాణ గడ్డపై వీరు లయ్యి,
వనము నందున వేల్పుగ వసుధ నిలచి,
మాఘ మాసము నందున మనసు గలిగి
జరుగు తిరునాళ్ళు వైభవ మరసి జూడ,
ఆ**
బండి వెన్క బండి బాగుగా నిలిచుండె
బస్సు నిండ జూడ భక్తు లంత,
వనము నందు జూడ వరుసగా యెటుజూడ,
భక్తి గల్గి గదలె బాగు నెంచి.
No comments:
Post a Comment