Saturday, December 31, 2016




           ఉషోదయం -వస్తుంది*.


చీకటిని చూసి బాధలేదు,
ఎందుకంటే,
తిరిగితెలవారుతుందని తెలుసు.
మోడువారిన జీవితమని,
ముగించుకొని పోలేను,
ఎందుకంటే
ఎక్కడో ఓ చిన్న
ఆశ
చిగురుతొడుగుతోంది.
ప్రకృతి కోపగించి వికృతముగా
కరాళ నృత్యం చేసినా,
కష్టాలకడలిలోి హోరెత్తిన అలలు,
అలిసిపోయి నిలిచే సమయం రాదా!

అనంత భారతావని
కోటి ఆశలతో ముందుకెలుతోంది,
ఈ చీకటితొలగిపోయి,
ముదుసళ్ళకే పరితమితమైన,
ఈ పల్లెల్లో,
వెలుగులు పంచే ఉషోదయం
ముందుందని,
బాలభానుని నునులేత కిరణాలు
ప్రసరిస్తుంటే,
అనిపిస్తోంది ....
నాకూ మంచిరోజు వస్తుందని,
నేడు కాకపోతే రేపు.


31/12/2016.


Thursday, August 25, 2016

🌺🙏🌺


🌺🌺🌺🌺🌺🌺🌺
కృష్ణమ్  వందే జగద్గురుమ్.
🌸🌸🌸🌸🌸🌸🌸

సీ.
రేపల్లె వాడల్లో గోపెమ్మ వళ్ళోన,
    చక్కగా మురిసేటి చక్రినీవె,
తాపసీ జనములు తపమాచ రింపగా,
    తరియింప జేసిన తండ్రి నీవె,
భామల కనుగప్పి పాలువెన్నలు దిని,
     దొరుకక తిరిగేటి దొంగ వీవె,
నల్లనీ నగుమోము నయగార మొప్పగా,
     నమ్మికొలచువారి నందమీవె,
తే.
నమ్మి కొలిచిన వారికి సొమ్ములిచ్చి,
కొవ్వు గలిగిన వారల కొంపముంచి,
భక్తి గలిగిన వారల ముక్తినొసగి,
మమ్ము పాలించు మాతండ్రి మరువమెపుడు.
   
           అంబటి భానుప్రకాశ్.

Monday, August 22, 2016

🌺🙏�🌺🙏�🌺

  కృష్ణా పుష్కరాలు

సీ.
సహ్యాద్రి కనుమల్లో, సాగింది పయనమే,
    పాలనురగవంటి పరుగు నీదె,
తెలగాణ నేలలో తెగువనే జూపించి,
    తంగడందున జేరి తరలి వచ్చె.,
గలగల నవ్వుతూ,  జలజల పారుతూ,
    శోభనే దెచ్చింది శుభముగాను,
తలనిండ స్నానాలు తప్పకుండాజేసె,
    భక్తజనులకుండు బాధ దీర్చు,
ఆ.
తుంగభద్ర గలియు సంగమంబున జూడ,
పుణ్య ప్రదమె దెలియు పుష్కరాన,
నీటమునిగి నిన్ను నిజముగా కొలిచేము,
దారి జూపు కృష్ణ. దైవమీవె.

         -- అంబటి భానుప్రకాశ్.

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺☘☘☘☘☘☘☘☘☘
🌺🙏�🌺🙏�🌺

  కృష్ణా పుష్కరాలు

సీ.
సహ్యాద్రి కనుమల్లో, సాగింది పయనమే,
    పాలనురగవంటి పరుగు నీదె,
తెలగాణ నేలలో తెగువనే జూపించి,
    తంగడందున జేరి తరలి వచ్చె.,
గలగల నవ్వుతూ,  జలజల పారుతూ,
    శోభనే దెచ్చింది శుభముగాను,
తలనిండ స్నానాలు తప్పకుండాజేసె,
    భక్తజనులకుండు బాధ దీర్చు,
ఆ.
తుంగభద్ర గలియు సంగమంబున జూడ,
పుణ్య ప్రదమె దెలియు పుష్కరాన,
నీటమునిగి నిన్ను నిజముగా కొలిచేము,
దారి జూపు కృష్ణ. దైవమీవె.

         -- అంబటి భానుప్రకాశ్.

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺☘☘☘☘☘☘☘☘☘

Monday, May 30, 2016

కం**☘🌺☘

సతతము నాతని నమ్మిన,
వెతలను బాపగ గదులును వేడిన వారిన్ !
మతమది యేలర, గురునికి
వ్రతపీఠముపైన బాదరక్షల నిడుమా !!
తే**
జనని కోరిక మన్నించి జనత వదలి,
వనము కేగెను దశరథ ప్రథమ సుతుడు,!
నీదు పాదుక లేలును నిలను,ననుచు
భరతుడంపె రాముని వనవాసమునకు



సమస్య :-భరతుడంపె రాముని వనవాసమునకు.

తే**
జనని కోరిక మన్నించి జనత  వదలి,
వనము కేగెను  దశరథ ప్రథమ సుతుడు,!
నీదు పాదుక లేలును నిలను,ననుచు
భరతుడంపె రాముని వనవాసమునకు




..........అంబటి.

Monday, May 9, 2016

అంబటి భానుప్రకాశ్.
దుప్పల్లి.
పాలమూరు జిల్లా.

             **ద్విపద.**

నారాయణుం గొల్తు  నయముగ నేను,
పారాయణము జేతు పదములు నమ్మి,
వేదాలు గొనితెచ్చె విమలనేత్రుండు ,
పాదాలు గొలుతునే  బరమును గోరి,
యవతారములు దాల్చి యాపద దీర్చు,
భువనమంతయు తాను భుక్తిదా నిచ్చు,
సారెసారెకు నేను సారంగ ధరుని,
కోరి రమ్మనుచును కూర్మినే నిడుదు,
సర్వ రక్షకుడని చాటింతు భువిని,
సర్వ మనుజులకు  సకలంబు శుభము....


అంబటి భానుప్రకాశ్.
దుప్పల్లి.
పాలమూరు జిల్లా.

             **ద్విపద.**

నారాయణుం గొల్తు  నయముగ నేను,
పారాయణము జేతు పదములు నమ్మి,
వేదాలు గొనితెచ్చె విమలనేత్రుండు ,
పాదాలు గొలుతునే  బరమును గోరి,
యవతారములు దాల్చి యాపద దీర్చు,
భువనమంతయు తాను భుక్తిదా నిచ్చు,
సారెసారెకు నేను సారంగ ధరుని,
కోరి రమ్మనుచును కూర్మినే నిడుదు,
సర్వ రక్షకుడని చాటింతు భువిని,
సర్వ మనుజులకు  సకలంబు శుభము....


Sunday, May 8, 2016

🌻🌺🌻

అంబటి భానుప్రకాశ్.
గద్వాల.
***    ***    ***
అమ్మా .......

ఏమని రాయను నీగురించి,
ఏమని తెలుపను నీ ఘనతను,

అసలు....
రాయగలనా.!.తెలుపగలనా.!
చేతనౌనా.!..సాధ్యమవునా.!

ఎవరు చేస్తారు నీయంత త్యాగం,!
ఎవరు అనుభవిస్తారు అంత కష్టం.!


కష్టాలు నీవుపడుతూ...
సుఖాలను మాకిస్తూ....
విషాన్ని నీవుమింగుతూ....
అమృతాన్ని మాకిస్తూ.....
అనుక్షణం ...ఎక్కడున్నా!
ఎప్పుడైనా..!
మా ఆనందం కోరుతూ,
మా క్షేమమును అడుగుతూ,
తను కరుగుతూ వెలుగు పంచే,
క్రొవ్వత్తి లాగా...!
మా జీవితానికి వెలుతురు నిచ్చే.
దేవతవు నీవే కదా.!

అందుకే .......
అమ్మా ......!
నీకు నేను ఏమిచ్చుకోగలను,

అమ్మా ...

పాదాభివందనం.

🌺🌺🌻🌺🌺
🌻🌺🌻

అంబటి భానుప్రకాశ్.
గద్వాల.
***     ***       ***  


అమ్మా .......

ఏమని రాయను నీగురించి,
ఏమని తెలుపను నీ ఘనతను,

అసలు....
రాయగలనా.!.తెలుపగలనా.!
చేతనౌనా.!..సాధ్యమవునా.!

ఎవరు చేస్తారు నీయంత త్యాగం,!
ఎవరు అనుభవిస్తారు అంత కష్టం.!


కష్టాలు నీవుపడుతూ...
సుఖాలను మాకిస్తూ....
విషాన్ని నీవుమింగుతూ....
అమృతాన్ని మాకిస్తూ.....
అనుక్షణం ...ఎక్కడున్నా!
ఎప్పుడైనా..!
మా ఆనందం కోరుతూ,
మా క్షేమమును అడుగుతూ,
తను కరుగుతూ వెలుగు పంచే,
క్రొవ్వత్తి లాగా...!
మా జీవితానికి వెలుతురు నిచ్చే.
దేవతవు నీవే కదా.!

అందుకే .......
అమ్మా ......!

నీకు నేను ఏమిచ్చుకోగలను,

అమ్మా ...

పాదాభివందనం.

🌺🌺🌻🌺🌺

Monday, April 25, 2016

🌺🙏🌺


అంబటి భానుప్రకాశ్.
గద్వాల.

🌺కం**
అంబటి వంశము నందున
సంబరము గలుగ జనించి సాగితి గవినై
యంబటి పేరును నిలుపగ
నంబారి పయిం జరింతు నందఱు మెచ్చన్!




Tuesday, April 19, 2016

దుర్ముఖీ నామ సంవత్సర ఉగాది.


తే.       శ్రీకరమ్ముగ యుగాది సిరులు గురియ

           బ్రహ్మ సృష్టియె మొదలైన భాగ్య మిదియె

          యుగము మొదలాయె నేటితో  వేగ ముగను

          సకల సౌభాగ్య సంపద జగతి నిండ!      1.

.      హరిని నమ్మి కొలుచు హరిభక్తు నారదుం

          డతివ రూపు గలిగి హరిని మరిచె!

          కాపు రంబు జేయ కలిగిన కొమరులే

          తెలుగు వత్సరములె తెలియుడయ్య!!    2.

కం.     దుర్ముఖివి గాదు నీవున్,

          దుర్మార్గుల పాలిటికిని దుర్గవె యందున్!

          దుర్ముఖి నీకున్ జయమౌ!

          దుర్ముఖి కలుముల నొసంగు!  దోషము లేకన్!!                                             3.      

సీ.     చైత్రమాసము నందు సకలసంపద లీయ

                        చేరవచ్చె యుగాది చిత్రముగను!

         ఆఱు రుచులతోడ నందమౌ బ్రతు కిటు

                      తేట తెల్లముగాను తెలియపరచె!

         కోకిలమ్మల కూత   కొత్తపిలుపులుగా

                     కొంగుబంగారమై కూర్మి నిచ్చె!

వాసంత శోభతో వనమెల్ల పులకించి,

                     కొంగ్రొత్త భావాల కోర్కెల నిడె!

తే.        సిరుల సింగార మందెను చిత్ర ముగను

            కనుల కింపాయె మనసార కాంచ గాను

            నవ యుగాది పండువయు నానంద మిడగ

            జగతి తనువంత పులకింప చరిత వెలుగు! 4

 

.       చూడ ముచ్చ టైన  సొగసు నలదుకొని

           యవని యంత చాల నందగించ

           కొత్త వత్సరంబు కొలువు తీరెను నేడు

           నదె యుగాది యంచు నాదరింతు!        5.

 

తే.       శిశిర మందున నాకులు చెదిరి పోయి

           నేల రాలియు పడుటయె నిత్య కృతము!

           గడచి పోయిన బాధల విడిచి పెట్టి,

           కొత్త యాసలు తొడుగగ కోరి నడువు!!      6.

 

.       ఆరు రుచుల నలరు నందమే పచ్చడి,

            ఒగరు జూపు పొగరు నోపి కొనక,

            తీయ దనము పెట్టు తిప్పలు యెన్నియో,

            పులుపు తాను మిగుల నలుసు బెంచు,   7.

 

.       చేదు చేయు మేలు చెప్పగలరమీరు,

           కార మెపుడు బెంచు కలహ మెపుడు,

          నుప్పు నిప్పు గదర నూపిరి గొనిపోవు,

సమత పాటి సేయ సకల శుభము.        8.

 

తే.     పాడి పంటలు గలిగియు పచ్చదనము

         నాయురారోగ్యములుగల్గి యందరకును

        సకల సౌభాగ్యములతోడ సంతసమిడి

        దీవెన లొసంగ దుర్ముఖీ  రావె భువికి!!     9.

 

 

 

Monday, April 18, 2016

🌺🙏🌺

🌺


కం**
భానుని ఫలమని మింగగ,
భానుని పైకే ఎగిరెను !భయమే  లేకన్  !
భానుని దీవెన, యిల,యీ
భానుని దయగను కపివర! భక్తుడ నీకున్  !!


అంబటి భానుప్రకాశ్.
🙏🌺🙏
     కం**
రగులుచు నుండెను భానుడు,
సగమై పోయెను జలములు  సమరం బాయెన్  !
తగవుల మరచియు నిలతా,
పగ గల్గిన వాడే సౌఖ్యవంతుడు జగతిన్  !!


అంబటి భానుప్రకాశ్.
గద్వాల.

Monday, April 4, 2016

ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం


.సీ**

దేదీప్యమానమౌ,దివ్యప్ర భలగూడి,

         వెలుగుచుండెనుజూడ వేయి రెట్లు,

కదిలివచ్చెనునేడు కనువిందు జేయగా,

         వేదికయ్యెనునేడు విశ్వ మిచట,

కళలన్ని యొకచోట  కనులవిందుగజేసె,

         మనసంత పులకించి మరచు నట్లు,

హస్తిపురమునందు నానంద. వెలుగులే,

         భరత భూమియె నేడు భాగ్య మలర,

                                                  (312)

తే**

 దేశ దేశాల సంస్కృతి దివిని వెల్గ,

దేశ సంస్కృతి దెలుపగ దివ్య తనము,

భవ్య హైందవి వెలుగులు భాగ్య మలర

జనులు మెచ్చగ నేడిది జరుగు చుండె.(313)

 

కం**

అరవిం దానన మోమే,

విరిసిన మందారమాయె విరిబో ణీనిన్!

మురిసే మోమును జూచియు,

మరచిరి చెలులున్ పొలమని మరచితి నేనున్! !

 

 

కం**

మధురము రాముని నామము,

మధురము రాముని చరితము మనమున దలవన్!

సుధయే,రఘువరు నామా,

మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్! !౩౨౩

తే*

కరువు నందున రైతుల కలిమి జేర్చ,

విత్తు  చుండిరి నకిలీల విత్త నములు,

పంట వేసిన రైతుల కంట బడెను,

బెండ చెట్టుకు గాసెను బీర కాయ. !!

324.

🌺పురుషుడు 🌺

సీ**

పురుషుడై పుట్టుట పుణ్యమం దురుగాని,

     యెట్టిపుణ్యమునీ వెరుగలేదె,

తల్లిసోదరిగల్సి తలచుప నులనియు,

    తప్పకుండగజేయ తరల వలెను,

ఆలియొక తోడులే యనుచునుం దురుగానీ,

     వేళద ప్పకను వెంబ డించు,

యందర కోసమె యన్నిజేసినగాని,

     యేమిజే సితివని యెదురు జెప్పు.

 

 ఆ**

 కాప లాగ యుండి కాచవ లెనిగాని,

 వెంట రాక యున్న వేరు మాట,

అన్ని పనుల నొంటి యైజేయు మగవాడె,

పురుషు నెపుడు మీరు గౌర వింపు,

 

కం**

కాలముతోపోటీపడి,

చాలగ కవితలు రచించె జనులే మెచ్చన్, !

మేలుగ యెంచుము వరుసను,

శ్రీలనువిరివిగ గడించు చెలిమియె  వీరా...!!

 

 కం**

మాటలు మానియు గదులుము,

వూటగ మారును కవితలు వూరిం పగనే!

తేటల మాటలు గలసియు,

మేటిగ కవితలు జనించు మేదిని యందున్...!!

 

కం**

కవితా ప్రవాహమేయిది,

సవితా వెలుగులు వెలిగెడి సాయం వేళా...!

భవితకు బాటలు పడగను,

కవులకు వందన మనుచును కదిలెద నేనున్ ..!!

ఆట బొమ్మ కాదు.


సీ**

మహిళాదినోత్సవమనుచు దెలిపిరి,

          శుభములకాంక్షను సుగుణ మందు,

మాటలెన్నోజెప్పె మనసుగలదుమీకు,

           చేతలెట్లుమరతు చిన్నతనము,

ఆడది యెకతియెనేడుబయలువెడగ,

           కాచియుండెనునేడు నీచబుద్ది.

యొంటరి తనమున యొక్కతి భయముచే,

          బిక్కుమనుచును బెదరు చుండె.

 

ఆ**

      ఆడ పిల్ల గనగ యాపద యౌచుండె,

      ఎటుల బెంచ వలెనొ ఇట్టి యవని,  !

      ఆడ పిల్ల గావ నందరు గదలాలి

      మరువ వలదు భాను మంచి మాట. !!

ఆ**

    ఆడ పిల్ల యెపుడు యాటబొమ్మయెగాదు,

    ప్రాణ మున్న జీవి పడతి తాను,

    యింటి దీప మనగ యిట్లునే జెప్పితి,

    మరువ వలదు భానుని మంచి మాట.

 

ఆడది


సీ**

ఆడదనగజెప్పయనురాగమూర్తియె,

            అవనిపైనెలకొన్న యాది శక్తి.

అమ్మతానౌతుంది ,యాలితానౌనులే,

           అక్కచెల్లెళ్ళుతో నందమౌను,

దేశమేలుటెగాదు దివినేలగానౌను,

           భువనమంతయుజూడ పుణ్యచరిత,

వండిపెట్టుటగాదు,వలచునెప్పుడునిన్ను,

     కంటిపాపగనిన్ను గాచుకొనును.

 

ఆ**

కార్య మందు దాసి,కరణేషు మంత్రియౌ,

భోజ్య మందు తల్లి,భోగి రంభె.

ప్రేమ యిచ్చిజూడ ప్రేమించు నెప్పుడూ,

మదిన నిన్ను కొలిచి మంచి జెప్పు, !

 

తే**

సహన మందున భూమాత సాధ్వి తాను,

మగని నడిపించు వెనుకుండి మహిమ తాను,!

బాధ పెట్టగ వలదురా భార్య నెపుడు.

మరువ వలదోయి భానుని మంచి మాట.  !!          

 

తే**

సాయి నాధుని కృపయేర సాయ మౌను,

సాయి వదలడు యెవరిని సాక కుండ,

సాయి నామము పలుకుర సాయ మందు,

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

మేఘాకారలింగం


ఆ**

పంచ భూత నాధు పరివార మంతయు,

కలియ దిరుగు నంత కాంతి తోడ,!

భువన మంత మ్రొక్కు భూతనా ధుశివుడే,

మరువ వలదు భాను మంచి మాట, !!

Saturday, April 2, 2016

పరమ పురుషుడు.


తే.
గురుడు జెప్పగ వలెనోయి గురుతు నెపుడు,

గురువు జెప్పని జ్ఞానము గుడ్డి దౌను

గురుడె జెప్పును నీకును పురుషు జాడ,

పరమ పురుషుని దెలువగ పనిని గనుము.

 

కం**

వాలము బట్టియు,హనుమే,

కాలము మించిన ,పయనము కడలిని దాటెన్

చేలము గట్టగ లంకను,

నేలను నిలువక యెగురుచు నేర్పున గాల్చెన్.

 

శ్రీ రామ

కం**

శ్రీరామా రఘువంశజ,

సారస నయనా ,జయమని సంతస మనగా

ధీరా వీరా దశరథ,

కారణ జన్మా సురాజ కరుణా జలధీ...!!

పాకు-బాకు.

ఆ**

స్నేహ మనగ రారు స్నేకులే వారలు,

కపట ప్రేమ జూపు కఠినులైరి,

పాకు దేశ మందు పాడుబుద్దుల వారు,

బాగు పడరు వారు భవిత గనరు. !!

దేశ భాష అభ్యసించు

తే**

ఆంగ్ల మొక్కటె గాదుర అవని  యందు,

భాష లెన్నియొ యున్నవి  బంధు లార

దేశ భాషను అభివృద్ధి దెలియ గనుము

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

  తే**

అఖిల భాషలు భాషించు భాగ్య మబ్బ

ఆంగ్ల మాదిగ భాషలు యభ్య సించు

దెలుగు భాషను యుంచుము దిరుగు లేక

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

మాతృభాష

సీ**

మాతృభాషనెపుడు మనసందు దలువుము

       మరువరానిదెపుడూ మహిని యందు,

పుట్టినదిమొదలు గిట్టువరకునుండు,

      తల్లిభాషనెపుడు తలువ వలయు.

పరభాషలెన్నియో పాటిసేయగరావు

       పలుకవలయునేడు పరువుగల్గ,

అన్యభాషనునేర్చి యందమందురెగాని,

       యమ్మభాషనుమాట "యక్షయంబె."

 

ఆ-*

తల్లి దండ్రి తోడ తలపునే నుండును,

మరణ కాల మైన మరపు రాదు.

మాతృ భాష బల్క మంచియౌ నేగాని

కష్ట మనగ లేదు కాంచ నెపుడు.

 

తే**

తల్లిపాలనుగూడుక తనకు నబ్బు      

  అమృతమేయంటి, సేవింపు యమ్మ భాష.

తెలియ జెప్పితి నేడిగ దెలివి గలిగి,

మరువ వలదోయి భానుని మంచి మాట.

చెరువు

ఆ**

అడవి పక్షులన్ని హాయిగా బ్రతికేను,

చెరువు గాచు వాని కరువు రాక

మనుషు లంత గలిసి మనగనే గాపాడు

సకల జంతు గణము సంత రింప

 

ఆ**

అన్నదాత యెపుడు యాధార పడుగాని,

చెరువు దీర్చు యెపుడు కరువు నంత

జీవకోటి బ్రతుక జీవనాధారము

నీటినెపుడు నీవు నిలిపియుంచు.

 

ఆ**

అన్నదాత లేక. నాహారమేలేదు,

నీవులేక యున్న నిలువలేడు.

నీటినొసగి జనుల నిత్యమూగాపాడు,

చెరువు దొలగ జేయు కరువు నెపుడు,

 

కం**(సర్వ లఘు కందము)

చెరువును,నెగలగ యెపుడును

మరువక దలువర మనుపగ మరిమరి    చెబుదున్,

చెరువును చెరపక నిలుపుము,
చెరువును చెరపగ దలచిన, చెరుపవు మనకున్