.సీ**
దేదీప్యమానమౌ,దివ్యప్ర
భలగూడి,
వెలుగుచుండెనుజూడ వేయి రెట్లు,
కదిలివచ్చెనునేడు కనువిందు జేయగా,
వేదికయ్యెనునేడు విశ్వ మిచట,
కళలన్ని యొకచోట
కనులవిందుగజేసె,
మనసంత
పులకించి మరచు నట్లు,
హస్తిపురమునందు నానంద. వెలుగులే,
భరత భూమియె
నేడు భాగ్య మలర,
(312)
తే**
దేశ దేశాల సంస్కృతి
దివిని వెల్గ,
దేశ సంస్కృతి దెలుపగ దివ్య తనము,
భవ్య హైందవి వెలుగులు భాగ్య మలర
జనులు మెచ్చగ నేడిది జరుగు చుండె.(313)
కం**
అరవిం దానన మోమే,
విరిసిన మందారమాయె విరిబో ణీనిన్!
మురిసే మోమును జూచియు,
మరచిరి చెలులున్ పొలమని మరచితి నేనున్! !
కం**
మధురము రాముని నామము,
మధురము రాముని చరితము మనమున దలవన్!
సుధయే,రఘువరు
నామా,
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్! !౩౨౩
తే*
కరువు నందున రైతుల కలిమి జేర్చ,
విత్తు చుండిరి
నకిలీల విత్త నములు,
పంట వేసిన రైతుల కంట బడెను,
బెండ చెట్టుకు గాసెను బీర కాయ. !!
324.
No comments:
Post a Comment