తే.
శ్రీకరమ్ముగ యుగాది
సిరులు గురియ
బ్రహ్మ సృష్టియె మొదలైన
భాగ్య మిదియె
యుగము మొదలాయె
నేటితో వేగ ముగను
సకల సౌభాగ్య సంపద జగతి
నిండ! 1.
ఆ.
హరిని నమ్మి కొలుచు
హరిభక్తు నారదుం
డతివ రూపు గలిగి హరిని
మరిచె!
కాపు రంబు జేయ కలిగిన
కొమరులే
తెలుగు వత్సరములె
తెలియుడయ్య!! 2.
కం.
దుర్ముఖివి గాదు
నీవున్,
దుర్మార్గుల పాలిటికిని
దుర్గవె యందున్!
దుర్ముఖి నీకున్ జయమౌ!
దుర్ముఖి కలుముల
నొసంగు! దోషము లేకన్!! 3.
సీ.
చైత్రమాసము నందు
సకలసంపద లీయ
చేరవచ్చె యుగాది చిత్రముగను!
ఆఱు రుచులతోడ నందమౌ బ్రతు
కిటు
తేట తెల్లముగాను
తెలియపరచె!
కోకిలమ్మల కూత కొత్తపిలుపులుగా
కొంగుబంగారమై
కూర్మి నిచ్చె!
వాసంత శోభతో వనమెల్ల
పులకించి,
కొంగ్రొత్త
భావాల కోర్కెల నిడె!
తే.
సిరుల సింగార మందెను
చిత్ర ముగను
కనుల కింపాయె మనసార
కాంచ గాను
నవ యుగాది పండువయు
నానంద మిడగ
జగతి తనువంత పులకింప
చరిత వెలుగు! 4
ఆ.
చూడ ముచ్చ టైన సొగసు నలదుకొని
యవని యంత చాల నందగించ
కొత్త వత్సరంబు కొలువు
తీరెను నేడు
నదె యుగాది యంచు
నాదరింతు! 5.
తే.
శిశిర మందున నాకులు
చెదిరి పోయి
నేల రాలియు పడుటయె
నిత్య కృతము!
గడచి పోయిన బాధల విడిచి
పెట్టి,
కొత్త యాసలు తొడుగగ
కోరి నడువు!! 6.
ఆ.
ఆరు రుచుల నలరు
నందమే పచ్చడి,
ఒగరు జూపు పొగరు నోపి
కొనక,
తీయ దనము పెట్టు
తిప్పలు యెన్నియో,
పులుపు తాను మిగుల
నలుసు బెంచు,
7.
ఆ.
చేదు చేయు మేలు
చెప్పగలరమీరు,
కార మెపుడు బెంచు కలహ
మెపుడు,
నుప్పు నిప్పు గదర
నూపిరి గొనిపోవు,
సమత పాటి సేయ సకల
శుభము. 8.
తే. పాడి
పంటలు గలిగియు పచ్చదనము
నాయురారోగ్యములుగల్గి
యందరకును
సకల సౌభాగ్యములతోడ
సంతసమిడి
దీవెన లొసంగ దుర్ముఖీ రావె భువికి!! 9.
No comments:
Post a Comment