ఆ**
అడవి పక్షులన్ని హాయిగా బ్రతికేను,
చెరువు గాచు వాని కరువు రాక
మనుషు లంత గలిసి మనగనే గాపాడు
సకల జంతు గణము సంత రింప
ఆ**
అన్నదాత యెపుడు యాధార పడుగాని,
చెరువు దీర్చు యెపుడు కరువు నంత
జీవకోటి బ్రతుక జీవనాధారము
నీటినెపుడు నీవు నిలిపియుంచు.
ఆ**
అన్నదాత లేక. నాహారమేలేదు,
నీవులేక యున్న నిలువలేడు.
నీటినొసగి జనుల నిత్యమూగాపాడు,
చెరువు దొలగ జేయు కరువు నెపుడు,
కం**(సర్వ లఘు కందము)
చెరువును,నెగలగ
యెపుడును
మరువక దలువర మనుపగ మరిమరి చెబుదున్,
చెరువును చెరపక నిలుపుము,
చెరువును చెరపగ దలచిన, చెరుపవు మనకున్
No comments:
Post a Comment