సీ**
పురుషుడై పుట్టుట పుణ్యమం దురుగాని,
యెట్టిపుణ్యమునీ వెరుగలేదె,
తల్లిసోదరిగల్సి తలచుప నులనియు,
తప్పకుండగజేయ
తరల వలెను,
ఆలియొక తోడులే యనుచునుం దురుగానీ,
వేళద ప్పకను
వెంబ డించు,
యందర కోసమె యన్నిజేసినగాని,
యేమిజే సితివని
యెదురు జెప్పు.
ఆ**
కాప లాగ యుండి కాచవ
లెనిగాని,
వెంట రాక యున్న
వేరు మాట,
అన్ని పనుల నొంటి యైజేయు మగవాడె,
పురుషు నెపుడు మీరు గౌర వింపు,
కం**
కాలముతోపోటీపడి,
చాలగ కవితలు రచించె జనులే మెచ్చన్, !
మేలుగ యెంచుము వరుసను,
శ్రీలనువిరివిగ గడించు చెలిమియె వీరా...!!
కం**
మాటలు మానియు గదులుము,
వూటగ మారును కవితలు వూరిం పగనే!
తేటల మాటలు గలసియు,
మేటిగ కవితలు జనించు మేదిని యందున్...!!
కం**
కవితా ప్రవాహమేయిది,
సవితా వెలుగులు వెలిగెడి సాయం వేళా...!
భవితకు బాటలు పడగను,
కవులకు వందన మనుచును కదిలెద నేనున్ ..!!
No comments:
Post a Comment