Monday, April 4, 2016

ఆడది


సీ**

ఆడదనగజెప్పయనురాగమూర్తియె,

            అవనిపైనెలకొన్న యాది శక్తి.

అమ్మతానౌతుంది ,యాలితానౌనులే,

           అక్కచెల్లెళ్ళుతో నందమౌను,

దేశమేలుటెగాదు దివినేలగానౌను,

           భువనమంతయుజూడ పుణ్యచరిత,

వండిపెట్టుటగాదు,వలచునెప్పుడునిన్ను,

     కంటిపాపగనిన్ను గాచుకొనును.

 

ఆ**

కార్య మందు దాసి,కరణేషు మంత్రియౌ,

భోజ్య మందు తల్లి,భోగి రంభె.

ప్రేమ యిచ్చిజూడ ప్రేమించు నెప్పుడూ,

మదిన నిన్ను కొలిచి మంచి జెప్పు, !

 

తే**

సహన మందున భూమాత సాధ్వి తాను,

మగని నడిపించు వెనుకుండి మహిమ తాను,!

బాధ పెట్టగ వలదురా భార్య నెపుడు.

మరువ వలదోయి భానుని మంచి మాట.  !!          

 

తే**

సాయి నాధుని కృపయేర సాయ మౌను,

సాయి వదలడు యెవరిని సాక కుండ,

సాయి నామము పలుకుర సాయ మందు,

మరువ వలదోయి భానుని మంచి మాట.

 

No comments:

Post a Comment